ETV Bharat / city

'తెరాస పాలనకు ఓట్లతో గుణపాఠం చెప్పండి' - kishan reddy inaugurated bjp office

హైదరాబాద్​లోని గాంధీనగర్​ డివిజన్​లో భాజపా ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. తమ ఓట్లతో తెరాసకు గట్టి గుణపాఠం చెప్పాలని సూచించారు.

kishan reddy participated ghmc election campaign at gandhinagar

author img

By

Published : Nov 22, 2020, 9:41 AM IST

'తెరాస పాలనకు ఓట్లతో గుణపాఠం చెప్పండి'

భాగ్యనగర ప్రజలు సీఎం కేసీఆర్​ పాలనతో విసిగి వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్ భాజపా ఎన్నికల కార్యాలయాన్ని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, డివిజన్ భాజపా అభ్యర్థి పావనితో కలిసి ప్రారంభించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్ ప్రజల్లో ఎంఐఎం, తెరాస పార్టీలు భయాందోళన కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. తెరాస పాలన పట్ల దుబ్బాక ప్రజలు, రైతులు, కర్షకులు చైతన్యవంతమై ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. అదే స్ఫూర్తి హైదరాబాద్​​లోని విద్యావంతులు, మేధావులు తమ ఓటుతో తెరాసకి బుద్ధి చెప్పటం తథ్యమన్నారు. మాయమాటలతో మోసం చేసే తెరాస అభ్యర్థులను అడుగడుగునా... ప్రజలు నిలదీయాలని కిషన్​రెడ్డి సూచించారు.

ఇదీ చూడండి: ‘గ్రేటర్‌’ ఎన్నికల వేళ... హైదరాబాద్​పై ఎన్నారైల అభిప్రాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.