ETV Bharat / city

'తెలంగాణలో భాజపా జెండా ఎగురవేస్తాం'

తెలంగాణలో అధికారం చేపట్టడానికి భారతీయ జనతా పార్టీకి సానుకూల వాతావరణం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 11, 2019, 6:34 AM IST

Updated : Aug 11, 2019, 10:42 AM IST

'హైదరాబాద్‌... తర్వాత తెలంగాణలో జెండా ఎగురవేస్తాం'

కర్ణాటకలో అధికారంలోకి వచ్చామని... తర్వాత తెలంగాణలో జెండా ఎగురవేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాలలో నిర్వహించిన నగర కార్యవర్గ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. సమావేశానికి ముందు ఇటీవల మృతి చెందిన సుష్మాస్వరాజ్‌కు నివాళులు అర్పించారు.

భాజపాకు గుండెకాయ వంటి హైదరాబాద్‌లో విజయం సాధిస్తే రాష్ట్ర ఎన్నికలపై ప్రభావం పడుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతుందని... అదే తరహాలో తెలంగాణలో అధికారంలోకి రావాలని జాతీయ నాయకత్వం భావిస్తుందన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి కలిగిందని... జమ్ముకశ్మీర్ ప్రజలను జీవన స్రవంతిలోకి తీసుకరావడానికి మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 18 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా ఈ నెల 20 వరకు నమోదు చేయాలని సూచించారు.

ఇవీ చూడండి: రైల్వే స్టేషన్​లో మహాత్ముడి ఛాయాచిత్ర ప్రదర్శన

sample description
Last Updated : Aug 11, 2019, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.