ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు కీలక నేత... ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో ఏఓబీ మిలటరీ ప్లాటున్ సభ్యుడిగా ఉన్న సాంబ కోర అలియాస్ రణదేవ్ అలియాస్ దేవో... ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఇతనితోపాటు కట్ఆఫ్ ఏరియాకు చెందిన ఏడుగురు మిలీషియా సభ్యులు కూడా లొంగిపోయారు. లివిటిపుట్టులోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ హత్య కేసుతోపాటు 12 ఘటనలతో ఈయనకు సంబంధం ఉంది.
2017లో మావోయిస్టు పార్టీలో సభ్యునిగా చేరి... పెద్దబయలు ఏరియా కమిటీలో పనిచేశారు. అనంతరం ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ పరిధిలో ఉండే మిలటరీ ప్లాటూన్ సభ్యునిగా ఉన్నారు. దేవోపై ఒడిశా ప్రభుత్వం రెండు లక్షల రివార్డును ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీసులు కూంబింగ్ ఎక్కువ కావడం... ఏఓబీ జంటురాయిలో జరిగిన ఘటనతో మావోయిస్టుల పట్ల గిరిజనులకు ఎటువంటి నమ్మకం లేదని తెలిసిందని.. అందుకే తాను లొంగిపోతున్నాని ఎస్పీకి రణదేవ్ తెలిపారు.
ఇదీ చదవండి: ఏవోబీలో ఇంటింటా పోలీసుల తనిఖీ