Challan: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకున్న వాహనాలకు సంబంధించి మొత్తం చలాన్లను చెల్లించినట్లు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్‌నాయక్ ఆదివారం తెలిపారు. ఆయనకు చెందిన అయిదు వాహనాలపై 66 చలాన్లు ఉన్నాయని, ఇందుకు సంబంధించి రూ. 37,365 చెల్లించినట్లు వివరించారు. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబరు 14లో నిర్వహించిన తనిఖీల్లో దానం నాగేందర్‌కు చెందిన వాహనాన్ని పోలీసులు ఆపారు.
రూ.5175 చలానాలు చెల్లించాల్సి ఉందని గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయడంతో వాహనాన్ని వదిలిపెట్టడం వివాదస్పదమైంది. ట్రాఫిక్ పోలీసుల తీరును పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దానం తనకున్న వాహనాలకు సంబంధించిన చలాన్లను చెల్లించినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.