KGBV Teachers Protest: విధుల్లోంచి తొలగించిన పీఈటీ, సీఆర్టీ, పీజీసీఆర్టీ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని... లక్డీకాపూల్‌లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట కేజీబీవీ టీచర్లు ఆందోళనకు దిగారు. 6 నెలల క్రితం కాంట్రాక్టు పద్ధతిన రాష్ట్ర వ్యాప్తంగా 937 ఉద్యోగాలను భర్తీ చేసిందని... అప్పటి నుంచి వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడంపై మండిపడ్డారు.
'6 నెలల క్రితం కాంట్రాక్టు పద్ధతిన రాష్ట్ర వ్యాప్తంగా 937 ఉపాధ్యాయులను ప్రభుత్వం భర్తీ చేసింది. అప్పటినుంచి వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయించారు. సంవత్సరంలో చెప్పాల్సిన సిలబస్‌ను మూడు నెలల్లో పూర్తిచేశాం. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం ఎంత వరకు న్యాయం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మా బతుకులు అన్యాయం అయ్యాయి. ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్న సమయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని మమ్మల్ని విధుల్లోకి తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలి.'
-కేజీబీవీ మహిళా ఉపాధ్యాయులు
గర్భిణీలు, చిన్న పిల్లలతో వచ్చిన వారు తక్షణమే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని తమను విధుల్లోకి కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి:దంపతుల మధ్య ఘర్షణ.. పసికందును ఇటుక బట్టీకేసి కొట్టి చంపిన తండ్రి