ETV Bharat / city

రంగంలోకి సీబీఐ ఐజీ స్థాయి అధికారి.. కీలక వ్యక్తులను ప్రశ్నించే అవకాశం! - CBI investigation in Viveka Murder Case

ఏపీ మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసులో.. రేపటి నుంచే కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. కేసు విచారణకు సీబీఐలో ఐజీ స్థాయి అధికారి రామ్​కుమార్​ ఇవాళ కడపకు చేరుకున్నారు. సుమారు రెండు రోజుల క్రితమే వాచ్​మెన్​ రంగన్న వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో కొత్త అధికారి రంగ ప్రవేశంతో విచారణ వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ys viveka murder case
ys viveka murder case
author img

By

Published : Jul 25, 2021, 9:40 PM IST

Updated : Jul 25, 2021, 9:49 PM IST

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. కేసును విచారించేందుకు కొత్తగా సీబీఐ విభాగంలోని ఐజీ స్థాయి అధికారి రామ్ కుమార్ ఆదివారం కడపకు చేరుకున్నారు. మొన్నటి వరకు డీఐజీ సుధాసింగ్ 49 రోజులపాటుగా కేసులోని అనుమానితులను విచారించారు. వాచ్​మెన్​ రంగన్న రెండు రోజుల కిందట కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. అంతకంటే ఒకరోజు ముందే సీబీఐ డీఐజీ సుధాసింగ్​ను విజయవాడకు పంపించారు. ఆమె స్థానంలోనే తాజాగా రామ్​ కుమార్​ను నియమించారు. రంగన్న వాంగ్మూలాన్ని కీలక పరిణామంగా భావిస్తున్న సమయంలో.. కొత్త అధికారి రావటం ఆసక్తిని రేపుతోంది. మరోవైపు రేపట్నుంచే కేసులోని కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.

కొద్దిరోజుల కిందట మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షణ అధికారిని ఉన్నతాధికారులు మార్చారు. సీబీఐలో డీఐజీ ర్యాంకు హోదాలో దాదాపు ఏడాది నుంచి వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సుధాసింగ్​ను తప్పించారు. ఇప్పటికే కేసులో పలువురు కీలక అనుమానితులను కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి పిలిపించి విచారించారు. ఈ దర్యాప్తు విచారణకు ఆమెనే నేతృత్వం వహించారు.

రంగన్న వాంగ్మూలం

మరోవైపు ఈ కేసులో 23వ తేదీన 11 నుంచి 12 గంటల మధ్యలో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ఫకృద్ధీన్ సెక్షన్ 164 కింద రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. వాంగ్మూలం నమోదు చేసే సమయంలో మెజిస్ట్రేట్... రంగన్న మినహా మిగిలిన వారెవ్వరూ లేకుండా చూసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రంగన్నను సీబీఐ అధికారులు కడపకు తీసుకొచ్చారు. తాజాగా సీబీఐ విభాగంలోని ఐజీ స్థాయి అధికారి రంగంలోకి దిగటంతో ఆసక్తిని రేపుతోంది.

ఇదీచూడండి: RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు

రంగంలోకి సీబీఐ ఐజీ స్థాయి అధికారి.. కీలక వ్యక్తులను ప్రశ్నించే అవకాశం!

Last Updated : Jul 25, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.