ETV Bharat / city

Kerala Tourism: సరికొత్తగా "కేరళ టూరిజం".. ఏడాది పొడవునా పర్యాటకులకు ఆతిథ్యం

Kerala Tourism: పర్యాటకానికి మారుపేరు కేరళ. ఎటు చూసినా ప్రకృతి అందాలు, కొబ్బరి తోటలు, బ్యాక్​ వాటర్​లో బోటు ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలే కాదు.. ఆయుర్వేదానికి పుట్టినల్లు కేరళ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడి సొంత దేశంగా భావించే కేరళ.. పర్యాటకులకు జీవితంలో మరిచిపోలేని అనుభూతులు, అనుభవాలను కలిగిస్తుంది. కొవిడ్​ కారణంగా ఆ రాష్ట్రంలో పర్యాటక శాఖ చతికిలబడినా.. ఆ స్వర్గధామానికి మళ్లీ పర్యాటకులను రప్పించేందుకు కేరళ టూరిజం విశేషంగా కృషి చేస్తోంది. అందుకోసం వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.

author img

By

Published : Mar 26, 2022, 7:25 PM IST

kerala tourism
కేరళ టూరిజం

Kerala Tourism: ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ, వైవిధ్యమైన పర్యాటక పరవశాన్ని పొందేందుకు... కేరళ సరైన గమ్యస్థానమని ఆ రాష్ట్ర టూరిజం డైరెక్టర్‌ కృష్ణతేజ పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా.. కేరళలో కారవాన్‌ టూరిజం, వాటర్‌ టూరిజం, అడ్వెంచర్స్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. అన్ని వయసుల వారికీ ఆనందాన్ని పంచేలా విభిన్న సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. కరోనా అనంతరం అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ కేరళ టూరిజంను ప్రమోట్‌ చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో టూరిజం రోడ్‌ షో నిర్వహించారు.

ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త ఆవిష్కరణలు చేసిందని కృష్ణతేజ వెల్లడించారు. పర్యాటకులు తమ రాష్ట్రంలో ఎక్కువ రోజులు ఉండేందుకు... కొత్త టూరిజం స్పాట్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని బీచ్‌లు, హిల్ స్టేషన్లు, హౌజ్‌బోట్ వంటి అత్యాధునిక సదుపాయాలు.. ఏడాది పొడవునా పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాబోయే ఏడాది టూరిజంలో కేరళ ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షించే అవకాశాలున్నాయని కృష్ణతేజ వెల్లడించారు. ఈ ఏడాదిలో కేరళలో ట్రావెల్ మార్ట్, ఛాంపియన్స్ టోట్‌లీగ్ వంటి సాంస్కృతిక, సాహిత్య ఉత్సవాలు జరగబోతున్నాయని వివరించారు.

"హనీమూన్ జంటలను ఆకర్షించేలా ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశాం. ప్రత్యేక ప్రాంతాల కోసం కారవాన్‌ టూరిజంను అభివృద్ధి చేశాం. కేరళం టూరిజం వివరాల కోసం 'మాయ'అనే వర్చువల్‌ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. జంగిల్ లాడ్జిలు, తోటల సందర్శనలు, నగర జీవితం, ఆయుర్వేద ఆధారిత వెల్నెస్ సొల్యూషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో వాకింగ్​, పచ్చని కొండలపై ట్రెక్కింగ్ లాంటి అద్భుతమైన సాహస కార్యకలాపాలు ఉన్నాయి. ఇవన్నీ పర్యాటకులకు విభిన్నమైన అనుభవాలను అందిస్తాయి." -కృష్ణ తేజ, కేరళ టూరిజం డైరెక్టర్​

సరికొత్తగా "కేరళ టూరిజం"

ఇదీ చదవండి: 'హైదరాబాద్ ఫార్మా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.