ETV Bharat / city

కోర్టులో బలమైన వాదనలు వినిపించాలి: సీఎం కేసీఆర్

author img

By

Published : Nov 9, 2019, 4:45 AM IST

Updated : Nov 9, 2019, 7:35 AM IST

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం అవలంభించిన విధానాలపై హైకోర్టులో పక్కా ఆధారాలతో బలమైన వాదనలు వినిపించాలని అధికారులు, అడ్వొకేట్​ జనరల్​కు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.

'కోర్టులో బలమైన వాదనలు వినిపించాలి'
'కోర్టులో బలమైన వాదనలు వినిపించాలి'

ఆర్టీసీ సమ్మె కొనసాగింపు, హైకోర్టు వరుస విచారణల నేపథ్యంలో ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు నాలుగున్నర గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రూట్​ పర్మిట్లకు అనుమతులను కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టం -2019 మేరకు నిర్ణయం తీసుకున్న విషయాన్ని హైకోర్టుకు వెల్లడించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

వాదనలపై విస్తృత చర్చ

ఈ సమావేశంలో హైకోర్టులో వాదనల తీరుపై విస్తృతంగా చర్చించారు. వాటి సారాంశాన్ని ఏజీ, అధికారులు సీఎంకు వివరించారు. ఉమ్మడి ఆర్టీసీ విభజన , టీఎస్​ఆర్టీసీ ఏర్పాటు, ప్రభుత్వ సాయం, కార్మికుల సమ్మె, రూట్​ పర్మిట్ల నేపథ్యం వంటి అంశాలను హైకోర్టుకు నివేదించాలని అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.

ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ జోషి, అధికారులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్​ పాల్గొన్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Nov 9, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.