ETV Bharat / city

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​, సీఎం దసరా శుభాకాంక్షలు.. - గవర్నర్​ తమిళిసై దసరా శుభాకాంక్షలు

KCR and Governor wished Dussehra: చెడుపై.. మంచి విజయం దసరా ముఖ్య సందేశమని, ఇది ఎల్లకాలం వర్తిస్తుందని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడవాలని.... విజయానికి సంకేతమైన దసరా రోజు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని సీఎం కేసీఆర్​ ప్రార్థించారు.

telangana government
తెలంగాణ ప్రభుత్వం
author img

By

Published : Oct 5, 2022, 6:57 AM IST

KCR and Governor wished Dussehra: దసరా పండుగ పురస్కరించుకొని ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై... నవరాత్రి పండుగ మనలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. చెడుపై.. మంచి విజయం దసరా ముఖ్య సందేశమని, ఇది ఎల్లకాలం వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.

తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడవాలని.... విజయానికి సంకేతమైన దసరా రోజు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని సీఎం కేసీఆర్​ ప్రార్థించారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరాను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదని పేర్కొన్నారు. అలయ్‌ బలయ్‌ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనతి కాలంలోనే అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. విజయదశమి స్ఫూర్తిని కొనసాగిస్తామన్న కేసీఆర్‌.. ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.