ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. శాసనసభ వాయిదా పడిన వెంటనే నేరుగా రాజ్ భవన్కు వెళ్లిన సీఎం.. గవర్నర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, మున్సిపల్ ఎన్నికలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు ఎత్తిపోసిన నీటి వివరాలను గవర్నర్కు కేసీఆర్ వివరించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన పురోగతిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక గవర్నర్ను నియమించిన తర్వాత నరసింహన్ను కేసీఆర్ కలవడం ఇదే తొలిసారి.
ఇవీ చూడండి: ' రైతులు అప్పులు చేసే పరిస్థితే ఉండొద్దు'