ETV Bharat / city

ఏపీ: ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన సీఐ

తనకు అన్యాయం జరుగుతోందని.. న్యాయం చేయాలని.. ఆ దళిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి గోడు వినకుండానే.. సీఐ బూటు కాలితో తన్నాడు.. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కసిరాడు.. సీఐ నుంచి తన కుమారుడిని రక్షించుకోవడానికి బాధితుడి తల్లి యత్నించింది. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావడంతో విశాఖ రేంజ్​ డీఐజీ స్పందించారు.

author img

By

Published : Aug 5, 2020, 5:41 PM IST

ci attcked by a sc men in srikakulam
ఏపీ: ఎస్సీ యువకుడిని బూటు కాలితో తన్నిన సీఐ

ఏపీలో మరో ఎస్సీ వ్యక్తిపై దాడి జరిగింది. బాధ్యాతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ.. బూటు కాలితో ఎస్సీ వ్యక్తిని తన్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్​ ఆవరణలోనే జరగడం గమనార్హం. చుట్టూ గ్రామ పెద్దలు ఉన్నా ఒక్కరూ పట్టించుకోలేదు.

పలాస మండలం టెక్కలిపట్నంకు చెందిన ఎస్సీ వ్యక్తి ఇంటి స్థలం కోసం గత 5 రోజులుగా వివాదం నడుస్తోంది. తనకు న్యాయం చేయాలని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్​కు వచ్చి.. సీఐకు పరిస్థితిని వివరిస్తుండగానే.. సదరు అధికారి ఆ వ్యక్తిపై తన ప్రతాపం చూపాడు. బూటు కాలితో తన్ని.. దాడికి దిగాడు. పక్కనే ఉన్న బాధితుడి తల్లి... సీఐ నుంచి తన కుమారుడుని కాపాడుకునేందుకు ప్రయత్నించింది. చుట్టూ పెద్ద మనుషులు ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. బాధితుడు ఏడుస్తున్నా.. సీఐ కనికరం చూపలేదు.

  • సీఐ వేణుగోపాల్​పై సస్పెండ్ వేటు

ఎస్సీ వ్యక్తిపై.. సీఐ వేణుగోపాల్ దాడిచేసిన దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి. ఘటనపై స్పందించిన విశాఖ రేంజ్ డీఐజీ.. కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్​ను సస్పెండ్ చేశారు. సివిల్ వివాదంలో ఫిర్యాదుదారుడిపై అనుచితంగా ప్రవర్తించినందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీచూడండి: గిఫ్ట్ ఏ స్మైల్: కేటీఆర్​కు చెక్కు అందించిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.