తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం(Karthika Deepotsavam today in Tirumala) గురువారం సాయంత్రం జరగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తైన తరువాత దీపోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు... నేతి వత్తులతో దీపాలు వెలిగించి ఛత్రచామర, మంగళవాద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తారు. ఆనందనిలయంలోని శ్రీవారికి హారతి ఇస్తారు. గర్భాలయం, ఉప ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను తితిదే రద్దు చేసింది. కార్తిక పౌర్ణమి(Karthika Deepotsavam today in Tirumala) సందర్భంగా రాత్రి గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. గరుడవాహనంపై ఊరేగుతూ శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు.
తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి...
తిరుమల(tirumala) శ్రీవారి క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి (శాస్త్రీయ నామం ‘మాగ్నోలియా చంపక’)ని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) గుర్తించింది. తితిదే ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు.. తిరుమలలో సంప్రదాయ ఉద్యాన వనాలను తితిదే(TTD) అభివృద్ధి చేస్తోంది. ఇందులో.. తిరుమల గురించి వివిధ పురాణాల్లో పేర్కొన్న విధంగా పూల మొక్కలు, చెట్లను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజూ పూజాధికాల సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని అలంకరించే దివ్య పుష్పాల్లో సంపంగి ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్రీవారికి ఆలయాన్ని నిర్మించేటప్పుడు సంపంగి వనాన్ని తొలగించవద్దని సాక్షాత్తు శ్రీనివాసుడే స్వయంగా తొండమాన్ చక్రవర్తికి సూచించాడని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తోంది. నడిమి పడికావిలి గోపురం, మహాద్వార గోపురం మధ్య 30 అడుగుల గోడ నేటికీ సంపంగి ప్రాకారంగా పేరుగాంచింది.
నేడు తిరుమల కాలినడక మార్గాలు మూసివేత...
తిరుమల కాలినడక మార్గాలను (Tirumala pedestrian routes) రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు తితిదే (TTD) ప్రకటించింది. 17, 18 తేదీల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బుధ, గురువారాల్లో అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలలో (Tirumala pedestrian routes) భక్తులను అనుమతి నిలిపేస్తూ ఆదేశాలిచ్చింది.
గత వారంలో కురిసిన భారీ వర్షాలకు మెట్ల మార్గంలో (Tirumala pedestrian routes) జలపాతాన్ని తలపించేలా వరద ప్రవహించింది. దీంతో భక్తుల భద్రత దృష్ట్యా రెండు రోజుల పాటు నడక మార్గాలను మూసివేస్తున్నామని తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇదీచదవండి: TTD: తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి
tirumala: అలిపిరి నడక మార్గంలోకి వరద.. భయాందోళనకు గురైన భక్తులు