కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శంషాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆశీస్సుల కోసం ఆశ్రమానికి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మరోసారి స్వామీజీతో సమావేశం కానున్నట్లు వివరించారు. ఇక్కడ చాలా బాగుందని, పదిహేను, ఇరవై రోజుల తర్వాత మరోసారి వచ్చి ఆశ్రమమంతా చూస్తానని చెప్పారు. బెంగళూరులో ముఖ్యమైన సమావేశం ఉన్నందున ఉదయం ఎనిమిదిన్నరకు తిరుగు పయనం కానున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: చినజీయర్ స్వామితో యడియూరప్ప భేటీ