చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషి ఉపకలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బీఆర్‌కే భవన్‌లో శనివారం ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఆయన భార్య సంతోషికి రెవెన్యూశాఖలో ఉపకలెక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు.
పులి కూనకు కర్నల్ ‘సంతోష్’బాబు పేరు
రాజధానిలోని నెహ్రూ జూపార్కులో ఉన్న రాయల్ బెంగాల్ పులి ‘ఆశా’కు పుట్టిన మూడు పులికూనల్లో ఒకదానికి కర్నల్ సంతోష్‌బాబు పేరు మీదుగా ‘సంతోష్’ అని నామకరణం చేశారు. గల్వాన్ వద్ద అమరుడైన కర్నల్ సంతోష్‌బాబుకు నివాళిగా ఈ పేరు పెట్టినట్లు జూ అధికారులు తెలిపారు.