ETV Bharat / city

'కార్గిల్‌ కొండల్లో మార్మోగుతూనే ఉన్న​ వీరగాథ' - కార్గిల్​ విజయ్ దివాస్

చారిత్రక కార్గిల్‌ యుద్ధంలో దేశరక్షణ కోసం పోరాడి.. అమరులైన వీరజవాన్లను భారతమాత గుండెల్లో దాచుకుంది. ఆ రణంలో అమరవీరులైన జవాన్లలో ఒక కెప్టెన్‌ వీరగాథ ఉంది. ఆయన కథ సైనికుల్లోనే కాదు.. పౌరుల్లోనూ స్ఫూర్తి నింపుతోంది. మానవత్వం.. వీరత్వం కలగలిస్తే... ఆ యువకుడిలా ఉంటుంది. తరతరాల దేశభక్తి రక్తంలో ఉరకలెత్తుతుంటే.. ఉహ తెలిసిన నాటి నుంచే సైన్యంలో చేరాలని కలలు కన్నాడు. నునూగు మీసాల వయసులోనే మాతృభూమి రక్షణలో అమరుడయ్యాడు. కార్గిల్ యుద్ధ వీరుడు.. రియల్ లైఫ్ హీరో కెప్టెన్ విజయంత్ థాపర్.

https://www.etvbharat.com/telugu/telangana/bharat/bharat-news/28-years-for-kargil-victory-over-pakistan-india-pak-kargil-war/na20200725190250595
'కార్గిల్‌ కొండల్లో మార్మోగుతూనే ఉన్న కెప్టెన్ విజయంత్ థాపర్​ వీరగాథ'
author img

By

Published : Jul 26, 2020, 5:53 AM IST

కెప్టెన్ విజయంత్ థాపర్. కార్గిల్‌ యుద్ధంలో శత్రువు చేతికిచిక్కిన స్థావరాలని భారత సైన్యం తిరిగి చేజిక్కించుకోవటంలో కీలకపాత్ర తనది. ఆ క్రమంలోనే అసువులు కోల్పోయిన థాపర్‌కు దేశంమొత్తం అశ్రునివాళులు అర్పించింది. తల్లిదండ్రులకి చివరిగా తను రాసిన లేఖ... తిరిగి రాలేనని తెలిసినా.. తెగించి శత్రుమూకలపై దాడిచేస్తూ ముందుకురికిన తెగువ... దేశం గుండెల్లో స్ఫూర్తి రగిలిస్తోంది. ఆయన వీరగాథ ఎప్పటికీ కార్గిల్‌ కొండల్లో మార్మోగుతూనే ఉంటుంది.

శత్రువు గుండెల్లో యుద్ధట్యాంకరే..

మాజీ సైనికాధికారి వీ.ఎన్​. థాపర్ కుమారుడే విజయంత్‌. తండ్రే కాదు.. తాత, ముత్తాత అంతా సైనికాధికారులే. కొడుక్కి విజయంత్ అని ఓ యుద్ధ ట్యాంకర్ పేరు పెట్టుకున్నాడు వీ.ఎన్​. థాపర్. విజయంత్ శత్రువు గుండెల్లో యుద్ధట్యాంకరే అయ్యారు. ఉహ తెలియక ముందే తుపాకులు.. ట్యాంకర్ల మధ్యకు చేరుకున్న విజయంత్.. సైనిక వాతావరణంలో పెరిగినా.. మనసు మాత్రం వెన్న.

ఏడేళ్ల వయస్సులోనే..

చిన్నప్పట్నుంచి విజయంత్‌కు సైన్యంలో చేరాలనే ఆలోచన.. తాత ముత్తాతల్లా దేశ సేవలో తరించాలనే తపన. సైనికాధికారికి కావడం కోసం కసరత్తులు చేసేవారు. ఏడేళ్ల వయస్సులోనే విజయంత్ తుపాకి పేల్చాడని.. తండ్రి కల్నల్ వీఎన్ థాఫర్ గర్వంగా చెబుతారు.

సైన్నికాధికారిగా విధుల్లో చేరి..

లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం కఠోర కృషి చేసిన విజయంత్ మొదటి ప్రయత్నంలోనే సాధించాడు. 1998 డిసెంబర్‌ 12న శిక్షణ పూర్తి చేసుకున్న విజయంత్.. రాజ్ పుతానా రైఫిల్స్‌లో సైన్నికాధికారిగా విధుల్లో చేరి... తర్వాత తన ప్రస్థానాన్ని దేశమంతా చాటాడు.

రుక్సానా అనే ఓ చిన్నారి..

ఒకసారి... ఉగ్రవాదులను ఏరివేసేందుకు కశ్మీర్‌ కుప్వారాకు వెళ్లిన విజయంత్‌ను... అక్కడ రుక్సానా అనే ఓ చిన్నారి బాగా ఆకర్షించింది. స్తబ్దుగా ఉన్న అమ్మాయి గురించి పాఠశాల ఉపాధ్యా యులను వాకబు చేస్తే...మొదట్లో అందరిలానే ఉండేదని.. కళ్ల ముందే ఉగ్రవాదులు ఆమె తండ్రిని కాల్చి చంపారని.. ఆ షాక్‌తో మాట పోయిందని తెలిపారు. చలించిపోయిన విజయంత్ అప్పటి నుంచి ఆ కుటుంబ బాధ్యత తీసుకున్నారు. రుక్సానాను అక్కున చేర్చుకున్నారు.

'నన్ను చంపే బుల్లెట్ ఇంకా తయారు కాలేదు'

ఇంతలోనే కార్గిల్ యుద్ధం వచ్చింది. విజయంత్‌ బృందానికి టోటోలింగ్ మరో 2 పర్వతాలు విడిపించే బాధ్యత అప్పగించారు. మొత్తం యుద్ధంలో ఇవి కీలకమైనవి. క్లిష్టమైనవి. టోటోలింగ్‌ను విజయవంతంగా కైవసం చేసుకుని శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఆ సమయంలో తల్లి త్రిపాఠ థాపర్‌తో ఫోన్‌లో తన ఆనందం పంచుకున్న విజయంత్ 32 బుల్లెట్లను చాకచక్యంగా తప్పించుకున్నానని గర్వంగా చెప్పాడు. తల్లి ఆందోళన చెందితే.. అమ్మా.. నన్ను చంపే బుల్లెట్ ఇంకా తయారు కాలేదు. భయపడకు అని భరోసా ఇచ్చాడు.

తన ఆఖరి లేఖలో..

కెప్టెన్ విజయంత్ థాపర్ బృందం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో యుద్ధం చేసింది. పాక్ సేనలను ఓడించి తీరుతామన్న ధీమాతోనే ఉన్నా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కూడా ఉహించా రు. మరోజన్మ ఉంటే మళ్లీ సైన్యంలో చేరుతానని.. చేరదీసిన చిన్నారి రుక్సానాకు ప్రతినెల డబ్బు పంపించాలని.. తన ఆఖరి లేఖలో తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గ్రెనేడ్ దాడిలో జూన్ 29 2009న 22ఏళ్ల వయస్సులోనే వీర మరణం పొందాడు కెప్టెన్‌ విజయంత్‌.

విజయంత్‌ ఎట్‌ కార్గిల్..

విజయంత్ థాపర్ శౌర్యపరాక్రమాలు గుర్తించిన ప్రభుత్వం 'వీర చక్ర' ప్రకటించింది. కార్గిల్‌ లోని యుద్ధ స్మారకం లో ఉన్న హెలిప్యాడ్‌కు సైతం కెప్టెన్ విజయంత్ పేరు పెట్టారు. తను అమరుడైన ప్రాంతానికి ఆయన కుటుంబం ప్రతి సంవత్సరం వెళ్లి నివాళి అర్పిస్తోంది. రుక్సానా బాధ్యతను వీఎన్ థాఫర్ చూసుకుంటున్నారు. కెప్టెన్ విజయంత్ పై అతడి తండ్రి..”విజయంత్‌ ఎట్‌ కార్గిల్‌, ది బయోగ్రఫీ ఆఫ్‌ ఏ వార్‌ హీరో" పేరుతో గత సంవత్సరం పుస్తకం రాశారు.

ఇవీ చూడండి: 'కార్గిల్' విజయ గర్వానికి 21 ఏళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.