ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో నేటి నుంచి స్వామి మూలవిరాట్ దర్శనాన్ని నిలిపివేశారు. తిరిగి ఆగస్టులో పునః దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కాణిపాకంలో వినాయక స్వామి గర్భాలయం పునర్నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అప్పటివరకు కాణిపాకం ప్రధానాలయం పక్కనే ఉన్న చిన్న బాల ఆలయంలోని అత్తి చెట్టు వద్ద వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉదయం కాల అర్చన, మూర్తి హోమం, పూర్ణాహుతి, తత్వ అర్చన మొదలగు ప్రత్యేక పూజలు నిర్వహించి.. బాల విఘ్నేశ్వర విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
ఇదీచూడండి: రేపే యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణం... యాగ జలాలతో పర్వానికి శ్రీకారం