మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎనిమిది డివిజన్ల పరిధిలోని మొత్తం 263 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రూ.2,63,30,508 విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆయా డివిజన్ల కార్పొరేటర్ల చేతుల మీదుగా అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని వారు తెలిపారు. అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: ప్రతి ఆటోలో క్యూ ఆర్ కోడ్.. ప్రయాణికుల రక్షణే ప్రాధాన్యం