రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు తెలంగాణలోని వైద్య కళాశాలల్లో యూజీ కోర్సులు ప్రారంభించవద్దని స్పష్టం చేస్తూ... కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీచేశారు. కొవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి వైద్య కళాశాలలు మూసి వేసిన విషయం తెలిసిందే.
ఇటీవల ఎన్ఎంసీ సూచనల మేరకు వైద్య కళాశాలల ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతుండటంతో... ఎన్ఎంసీ చేసిన సూచనలను పాటించడం అత్యంత క్లిష్టతరమైనదని సర్కారు భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో యూజీ కోర్సులు ప్రారంభించవద్దని కాళోజీ వర్సిటీ ... అన్ని కళాశాలలకు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: తగ్గింది... కానీ... ఏమరుపాటుగా ఉంటే ప్రమాదమే!!