ETV Bharat / city

'ఆ భవనం సురక్షితం కాదని జేఎన్‌టీయూ ఇంజినీర్లు చెప్పారు' - ఆ భవనం సురక్షితం కాదని జేఎన్‌టీయూ ఇంజినీర్లు చెప్పారు

ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు కట్టడం సురక్షితం కాదని జేఎన్‌టీయూ సివిల్‌ ఇంజినీర్ల నివేదికతో భవనాన్ని ఖాళీ చేయించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఉస్మానియా భవన సంరక్షణకు, రోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.

High court on Osmania
ఆ భవనం సురక్షితం కాదని జేఎన్‌టీయూ ఇంజినీర్లు చెప్పారు
author img

By

Published : Aug 26, 2020, 5:58 AM IST

ఉస్మానియా ఆస్పత్రిలోని పురావస్తు కట్టడం సురక్షితం కాదని జేఎన్‌టీయూ సివిల్‌ ఇంజినీర్ల బృందం 2015లోనే నివేదిక సమర్పించిందని.. ప్రస్తుతం ఈ నిర్మాణాన్ని ఖాళీ చేయించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రత్యామ్నాయంగా క్యూక్యూడీసీ (కులీకుతుబ్‌ షా డయాగ్నస్టిక్‌ సెంటర్‌) భవనంపై చేసిన ఏర్పాట్లు ఆ లోటును భర్తీ చేస్తాయని పేర్కొంది. ఉస్మానియా భవనం పరిరక్షణకు, రోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేసింది. ఉస్మానియా ఆస్పత్రి ప్రమాదకరంగా ఉందంటూ హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తరఫున అధ్యక్షుడు కె.మహేశ్‌కుమార్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇక్కడ వైద్యులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు డీఎంఈ (ఇన్‌ఛార్జి) డాక్టర్‌ కె.రమేశ్‌రెడ్డి కౌంటరు దాఖలు చేశారు. ఆస్పత్రిలోని వారసత్వ కట్టడం సురక్షితం కాదని జేఎన్‌టీయూ సివిల్‌ ఇంజినీర్లు అంచనా వేయడంతో ఇందులో రోగులు ఉంటున్న రెండో అంతస్తు మొత్తం ఖాళీ చేయించామని తెలిపారు.

భవన నిర్మాణానికి సంబంధించి జేఎన్‌టీయూ ఇంజినీర్ల బృందం, హెరిటేజ్‌ సొసైటీలు భిన్న వాదనలు చేస్తున్నాయని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఒకవైపు జేఎన్‌టీయూకు చెందిన ఇంజినీర్లు నిర్మాణాన్ని సందర్శించి ఇది సురక్షితం కాదని చెప్పారంది. మరోవైపు భవనం పటిష్ఠంగా ఉందని, సరైన నిర్వహణ మాత్రమే లేదని హెరిటేజ్‌ సొసైటీలు పేర్కొంటున్నాయని వెల్లడించింది. భవన పరిరక్షణ, మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు గత ఏడాది జులైలో రూ.19.20 కోట్లు మంజూరు చేశామని తెలిపింది. ఇప్పటికే పాత హౌస్‌సర్జన్‌ క్వార్టర్స్‌ మరమ్మతులు పూర్తిచేసి వాటిని రోగుల అవసరాలకు వినియోగిస్తున్నామని చెప్పింది. కులీ కుతుబ్‌షా భవనంలో 16,000 చదరపు అడుగులకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, మరో 16 వేల చదరపు అడుగుల పనులు నెలలో పూర్తవుతాయని పేర్కొంది. ఇటీవల ఎడతెరపి లేని వర్షాలతో పాత హెరిటేజ్‌ భవనంలోకి నీళ్లు వచ్చాయని.. వాటిని తోడివేయడంతోపాటు రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించామని ప్రభుత్వం తెలిపింది. ఉస్మానియా భవనంపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు వచ్చే వారంలో విచారణ చేపట్టనుంది.

ఇవీ చూడండి: సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.