JC Prabhakar On Chandra Dandu: ప్రజా సమస్యలపై పోరాడుతుంటే రౌడీషీట్ ఓపెన్ చేసినా భయపడబోనని... తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏపీ అనంతపురంలో చంద్రదండు ప్రకాశ్ నాయుడును ఆయన కలిశారు. కళ్యాణదుర్గంలో చిన్నారి మృతిపై న్యాయవిచారణ జరిపించాలని నిరసనలు చేస్తే చంద్రదండు ప్రకాశ్ నాయుడుపై రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి మరింత పని చేస్తానని చెప్పారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు.
ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై రౌడీషీటర్ కేసు నమోదు చేస్తే భయపడేది లేదు. భగభగ మండుతాంది. నేను అనుభవించిన కష్టం ఎవరన్న అనుభవించారా? కల్యాణదుర్గంలో పసిపాప మృతి విషయంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రకాశ్‌నాయుడు నిరసన తెలిపితే అతనిపై రౌడీషీట్ తెరుస్తారా. ఇలాంటి కేసులకు భయపడేది లేదు. కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి మరింత పనిచేస్త. చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటా.
-- జేసీ ప్రభాకర్‌రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి:
KTR Tweet Today : 'భారత్‌లో ఎల్‌పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అధికం'
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిదో? విపక్షాలు కలిసి నడిస్తే విజయం తథ్యం!