ETV Bharat / city

JSPForAP_Roads : పవన్ పిలుపు.. రోడ్ల దుస్థితిపై లక్షల కొద్దీ ట్వీట్లు!

జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపుతో ఏపీలోని రహదారుల పరిస్థితిపై ట్విట్టర్ ద్వారా ఉద్యమాన్ని చేపట్టారు. ‘‘#jspforap roads హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ఈ ఉద్యమానికి రెండు రోజుల్లోనే 1.73లక్షల ట్వీట్లు వచ్చాయి.

janasena for roads
janasena for roads
author img

By

Published : Sep 4, 2021, 9:19 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన పిలుపుతో ఆంధ్రప్రదేశ్​లోని రహదారుల పరిస్థితిని సామాజిక మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ తెలిపారు. ‘‘#jspforap_roads హ్యాష్‌ట్యాగ్‌తో చేపట్టిన ఈ ఉద్యమానికి రెండు రోజుల్లోనే 1.73లక్షల ట్వీట్లు వచ్చాయి. వేలాది మంది తమ ప్రాంతాల్లో రోడ్లు ఏవిధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

'గురువారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం శనివారం వరకు కొనసాగుతుంది. రోడ్ల దుస్థితి 192.9మిలియన్ల మందికి చేరింది. ట్విటర్‌ ట్రెండింగ్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి, జాతీయస్థాయిలో ఐదో స్థానానికి చేరింది. అడుగుకో గుంత.. గజానికో గొయ్యిలా ఆంధ్రప్రదేశ్​లో రహదారులు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ చెప్పిన విషయం అక్షర సత్యమనే విషయం ఈ డిజిటల్‌ ఉద్యమంలో వస్తున్న ఫొటోలు, వీడియోలను చూస్తే అర్థమవుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోలు, వీడియోలు పంపించేందుకు సాధ్యంకాని వారి కోసం ఇచ్చిన వాట్సప్‌ నంబరుకు 10,455 చిత్రాలు, రెండు నిమిషాల నిడివి ఉన్న 5వేలకుపైగా వీడియోలు వచ్చాయి’’

- హరిప్రసాద్‌

  • ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై @JanaSenaParty డిజిటల్ క్యాంపన్

    శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం,
    రాజాం - విశాఖ ప్రధాన రహదారి మార్గం.#JSPForAP_Roads pic.twitter.com/gomelm3VlT

    — JanaSena Party (@JanaSenaParty) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.