ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థలపై(aided schools and colleges) సర్కారు నిర్ణయం దారుణంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(janasena president pawan kalyan) అన్నారు. అప్పుడు 'అమ్మ ఒడి' ఇచ్చి.. ఇప్పుడు 'అమ్మకానికో బడి' అన్నట్లు పాలన చేస్తున్నారని ఆక్షేపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రైవేటు పరం(privatization) చేయాలనే సర్కారు నిర్ణయంతో 2.5 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబాలు అతలాకుతలమయ్యాయని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారని, సర్కారు నిర్ణయంతో విద్యార్థులే బలిపశువులయ్యారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి దురుద్దేశాలు ఉన్నాయా..?
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి ప్రభుత్వం( AP government) ఎందుకు తొందరపడుతుందో సమాధానం చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విద్యాసంవత్సరం మధ్యలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని మండిపడ్డారు. ఇది ఆర్టీఈ(RTE) సూత్రాల ఉల్లంఘన కాదా? అని అన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా?, వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, టీచర్ల పోస్టులను(Teachers posts) ఎప్పుడు భర్తీ చేస్తారని పవన్ కల్యాణ్(janasena president pawan kalyan) ప్రశ్నించారు.
ఎయిడెడ్ విద్యాసంస్థలపై సర్కారు నిర్ణయం దారుణం. సర్కారు నిర్ణయంతో 2.5 లక్షల విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. విద్యార్థుల భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేశారు. ఎయిడెడ్ సంస్థల విలీనానికి ఎందుకు తొందర?. ప్రభుత్వానికి దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా?. టీచర్ల పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు?. - పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు
జనసేన ఆందోళనలు
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ వన్‌టౌన్ కొత్తపేట ఎస్‌కేపీవీ హిందూ హై స్కూల్ ముందు జనసేన పార్టీతో పాటు వివిధ విద్యార్థి సంఘాలు కలిసి ఇదివరకే ధర్నా చేపట్టింది. ఎయిడెడ్ స్కూళ్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపడుతున్న క్రమంలో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసుల వాహనాలపై విద్యార్థులు దాడికి యత్నించారు. అదుపులో తీసుకున్న వారిని వదిలివేయటంతో పరిస్థితి సద్దుమణిగింది. విజయవాడ వన్‌టౌన్ పరిధిలో సుమారు 10వేల మంది పిల్లలు ఎయిడెడ్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని.. వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయన్నారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి: