యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కలిసి రావాలని ఎంపీ రేవంత్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు నేతృత్వంలో యురేనియంపై అఖిలపక్ష సమవేశం సోమవారం జరగనుంది. హైదరాబాద్ దస్పల్లా హోటల్‌లో ఉదయం పది గంటలకు నిర్వహించనున్న ఈ అఖిలపక్ష సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డిని పవన్‌కల్యాణ్ ఆహ్వానించారు. పవన్ విజ్ఞప్తి మేరకు అఖిలపక్షం సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: భావితరాలకు కాలుష్య తెలంగాణ ఇద్దామా: పవన్