Kodali Nani: ఏపీ మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలంటూ జనసేన శ్రేణులు కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. తాము ఏం నేరం చేశామంటూ జనసేన కార్యకర్తలు ఎదురు తిరిగారు.
గోతుల మయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే రహదారిలో జన సైనికులు ధర్నా చేశారు. మొద్దు నిద్రపోతున్న సీఎం జగన్ మేల్కోవాలంటూ నినాదాలు చేశారు. వారిని నాని ఇంటికి వెళ్లకుండా పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఏపీలో రోడ్ల దుస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఇవీ చూడండి:
'సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం.. వాళ్ల సర్వేలే స్పష్టం చేస్తున్నాయి'
తెగిపోయిన అప్రోచ్ రోడ్డు.. ఆ రాష్ట్రానికి రాకపోకలు బంద్..
సిద్దరామయ్యకు చేదు అనుభవం.. రూ. 2 లక్షలు విసిరికొట్టిన మహిళ!