ETV Bharat / city

Gajendra Shekhawat at Polavaram : 'పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం' - కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఏపీ టూర్

Gajendra Shekhawat at Polavaram : పోలవరం నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని షెకావత్ హామీ ఇచ్చారు.

Gajendra Shekhawat at Polavaram
Gajendra Shekhawat at Polavaram
author img

By

Published : Mar 4, 2022, 2:05 PM IST

Gajendra Shekhawat at Polavaram : పోలవరం నిర్మాణ పనులను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో నిర్మించిన పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాన్ని వీక్షించారు. నిర్వాసితులతో మాట్లాడిన కేంద్రమంత్రి షెకావత్‌.. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వసతులు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పూర్తి చేస్తాయని షెకావత్‌ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జీవనోపాధికి, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

పోలవరం పర్యటనలో కేంద్ర మంత్రి షెకావత్

Gajendra Shekhawat Polavaram Visit : బాధితులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లిస్తామని ఏపీ సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. నిర్వాసితులకు స్థానికంగానే జీవనోపాధి కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు స్థానికులకు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తామని జగన్ తెలిపారు.

Gajendra Shekhawat About Polavaram Project : "పునరావాస కాలనీ పరిశీలించాను. అన్ని సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తున్నందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక అభినందనలు. ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నట్లు కొందరు నిర్వాసితులు తెలిపారు. ఇంటి నిర్మాణాలు మరింత నాణ్యంగా ఉండేలా అధికారులు దృష్టి పెట్టాలి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూడాలని సీఎంకు సూచించాను. వ్యవసాయంతోపాటు ఉపాధి దొరికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి".

- గజేంద్రసింగ్‌ షెకావత్‌, కేంద్రమంత్రి

అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తాడ్వాయిలోని నిర్వాసిత కాలనీలో కేంద్ర మంత్రి షెకావత్‌...సీఎం జగన్ పర్యటించారు. ఇళ్ల నిర్మాణాలను, సౌకర్యాలను పరిశీలించిన కేంద్రమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసితులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.