జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్ షరతులు సడలించవద్దని సీబీఐ కోరింది. విదేశాలకు వెళ్లేలా ఆరు నెలల పాటు బెయిల్ షరతులు సడలించాలన్న నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిర్ణయం రేపటికి వాయిదా వేసింది.
పెన్నా ప్రతాప్ రెడ్డి, రఘురాం సిమెంట్స్ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. పెన్నా సిమెంట్స్ కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు న్యాయస్థానం సీబీఐ చివరి అవకాశాన్ని ఇచ్చింది.
ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 16కి కోర్టు వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. శ్రీలక్ష్మి పిటిషన్‌పై విచారణను ఈనెల 16కి కోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటు దరఖాస్తుల గడువు పొడిగింపు