హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై మంగళవారం విచారణ చేపట్టారు. జగన్ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. రాంకీ ఛార్జ్షీట్లో అయోధ్య రామిరెడ్డి నిందితుడిగా ఉన్నారు.
మరోవైపు సీబీఐ ఛార్జ్ షీట్లు తేలిన తర్వాతే.. ఈడీ కేసులపై విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. జగతి పబ్లికేషన్స్ కేసులోని డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టేందుకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి అంగీకరించారు.
ఇదీచదవండి : సీజ్ చేసిన నగదును లాక్కెళ్లడం చాలా పెద్దనేరం: సీపీ జోయల్ డేవిస్