ETV Bharat / city

శాసనమండలి రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం

author img

By

Published : Jan 27, 2020, 10:15 AM IST

Updated : Jan 27, 2020, 11:26 AM IST

ap cm jagan
ap cm jagan

10:14 January 27

శాసనమండలి రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కాసేపట్లో  ఇందుకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రతిని కేంద్రప్రభుత్వానికి పంపనున్నారు. గత కొన్ని రోజులుగా ఉభయసభల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే  ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది.

పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపటంతో ఆగ్రహం చెందిన వైకాపా సర్కారు... శాసనమండలిని రద్దు చేసేందుకే మొగ్గుచూపింది. మండలిలో మెజారిటీ లేకపోవటంతో శాసనసభలో ఆమోదించిన బిల్లులు కౌన్సిల్​లో ఆమోదం పొందలేకపోతున్నాయి. బిల్లులు తిప్పి పంపడం, జాప్యం చేయడం ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్... శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేశారు. 
 
Last Updated : Jan 27, 2020, 11:26 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.