హైదరాబాద్లోని సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్‌షీట్‌లో ఎంపీ విజయసాయిపై అభియోగాల నమోదుపై వాదనలు జరిగాయి. విజయసాయిపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ వాదించింది. పబ్లిక్ సర్వెంట్ కానందున అవినీతి నిరోధక చట్టం వర్తించదని గతంలో విజయసాయి వాదించారు. పూర్తి వాదనలకు 10 రోజుల సమయమివ్వాలని సీబీఐ ప్రత్యేక పీపీ కోరారు.
జగతి పబ్లికేషన్స్, రాంకీ కేసుల విచారణ జనవరి 4కి వాయిదా పడింది. అలాగే వాన్‌పిక్, పెన్నా, భారతీ సిమెంట్స్ కేసుల విచారణను జనవరి 4కి వాయిదా వేశారు.
ఇదీ చదవండి: ఆసరా పింఛన్లకు నిధుల మంజూరు