తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్ శివన్‌తో పాటు శాస్త్రవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగించనున్న నేపథ్యంలో స్వామి ఆశీస్సులను పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజల నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని పండితులు వేదాశీర్వచనం చేసి... తీర్థప్రసాదాలు అందజేశారు. అమోజానియా-1తో పాటు మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు.
శ్రీనివాసుడికి ఉప్పెన బృందం కృతజ్ఞతలు
వెంకన్నకు ఉప్పెన చిత్ర బృందం ప్రత్యేక పూజలు చేసింది. నటుడు వైష్ణవ్ తేజ్, నటి కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీవారి మొట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్న బృందం... ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమలేశుని ఆశీస్సులు పొందింది. చిత్రం ప్రేక్షకాదరణ పొందిన ఆనందంతో.. మొక్కులు చెల్లించుకున్నామని వారు తెలిపారు.
- ఇదీ చూడండి : మాఘ పౌర్ణమి విశిష్టత ఏంటీ..?