ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి ఆలయానికి హెచ్‌వైఎం సంస్థ.. ఐఎస్వో ధ్రువీకరణ పత్రాలను అందజేసింది. వివిధ విభాగాల్లో పరిశీలించిన అనంతరం ఈ గుర్తింపునిచ్చింది. నాణ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగుల ఆరోగ్యం, ఆహారం, సమాచార భద్రత, విద్యుత్ నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పర్యవేక్షించారు. ఆలయ ఈవో పెద్దిరాజును సంస్థ ప్రతినిధులు కలిసి ఐఎస్వో పత్రాలు అందించారు.
ఇదీ చూడండి: సమష్టి కృషితో తుంగభద్ర పుష్కరాలు విజయవంతం: ఇంద్రకరణ్ రెడ్డి