ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో నేటి నుంచి 24 వరకు శాకంబరి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాలను వివిధ రకాల కూరగాయలతో బుధవారం అలంకరణ చేశారు. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రుత్వికులు పూజాదికాలు నిర్వహించారు.
దేవస్థానం ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడితో వాటిపైన పసుపు కుంకుమ చల్లించి శాస్త్రోక్తంగా అలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూలవిరాట్ దుర్గమ్మను వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈవో ధర్భముళ్ల భ్రమరాంబతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చదవండి: Rain Updates : దంచికొడుతున్న వర్షాలు.. పోటెత్తుతున్న వాగులు