ETV Bharat / city

'రూ.1500 విడతల వారిగా ఖాతాలో వేస్తాం'

లాక్​డౌన్​ నేపథ్యంలో రాష్ట్రంలో రేషన్​ బియ్యం పంపిణీ సాఫీగా కొనసాగుతోందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.1500 నగదును కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆ విషయాలను పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఈటీవీ భారత్​ ముఖాముఖిలో వివరించారు.

ration supply
ration supply
author img

By

Published : Apr 9, 2020, 12:19 PM IST

'రూ.1500 విడతల వారిగా ఖాతాలో వేస్తాం'

కరోనా నేపథ్యంలో బియ్యం పంపిణీ ఎలా కొనసాగుతోంది.

ఈ రోజు ఉదయం వరకు 63 లక్షల మంది రేషన్​ కార్డుదారులు బియ్యం తీసుకున్నారు. మిగిలిన 30 శాతం మందికి మరో ఐదారు రోజుల్లో పంపిణీ చేస్తాం.

జంట నగరాల్లో చౌకధరల దుకాణాల ముందు లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. సర్వర్​ మొరాయించడం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. వాటిని ఎలా అధిగమిస్తున్నారు.

సాధారణ పరిస్థితుల్లో రోజుకు 2 లక్షల మంది లబ్ధిదారులు బియ్యం తీసుకునేవారు. ఇప్పుడు ఒకేసారి 7 నుంచి 8 లక్షల మంది రావడంతో సర్వర్​లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తున్నాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాము.

ప్రభుత్వం ఇస్తామన్న రూ.1500 నగదును ఎప్పటివరకు అందిస్తారు.

ఇవాళ్టి నుంచి విడతల వారిగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తాం.

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే అవకాశం ఉందా.

కిలో పప్పు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు కేంద్రానికి లేఖ రాశాము. కేంద్రం నుంచి వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతావి ఎప్పుడు చేస్తారు.

ఇప్పటివరకు 6,849 కేంద్రాలు ఏర్పాటు చేశాం. 224 కేంద్రాలు ప్రారంభమయ్యాయి.

కోటి టన్నుల ధాన్యం వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. మీరు ఎంత లక్ష్యం నిర్దేశించుకున్నారు.

అలాంటి లక్ష్యాలు ఏమి లేవు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన పంటను మొత్తం కొనుగోలు చేస్తాం. కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నాము.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎన్ని రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.

గత సీజన్​లో 24 గంటల్లో డబ్బులు జమ చేశాం. ఈసారి నెలరోజుల్లో జమ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పినా... తొందరగానే ఇవ్వాలని మమ్మల్ని ఆదేశించారు. అందుకు సంబంధించిన రూ.25వేల కోట్ల నిధులు కూడా ఉన్నాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రకారం వెంటనే డబ్బులు జమ చేస్తాం.

ఇదీ చూడండి: ఒకటికి రెండుసార్లు కొవిడ్‌-19 నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.