ETV Bharat / city

ఇంటర్ పరీక్షలు షురూ.. గంట ముందే కేంద్రాలకు విద్యార్థులు - Intermediate Exams 2022

Intermediate Exams 2022 : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతించమని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ చెప్పడంతో విద్యార్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వారిని కళాశాల యాజమాన్యాలు.. అరగంట ముందే కేంద్రంలోనికి అనుమతించారు.

inter-exams-started-in-telangana
inter-exams-started-in-telangana
author img

By

Published : May 6, 2022, 9:30 AM IST

Intermediate Exams 2022 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో సిబ్బంది వారిని విద్యార్థులను క్షుణ్నంగా పరిశీలించి అరగంట ముందే లోనికి అనుమతించారు. కొన్ని చోట్ల విద్యార్థులు మాస్క్​ కచ్చితంగా ధరించాలన్న నిబంధన అమలు చేయగా.. మరికొన్ని చోట్ల అదేమి లేకుండానే లోపలికి పంపించారు.

Intermediate Exams Started Today 2022 : తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరుగుతోంది. పదో తరగతి వార్షిక పరీక్షలు కూడా రాయనందున ఇది వారికి తొలి బోర్డు పరీక్ష. 70 శాతం మాత్రమే సిలబస్‌, 50 శాతం వరకు ఛాయిస్‌ ఉండటంతో సగటు విద్యార్థి కూడా ఇంటర్‌ పరీక్షలను బాగానే రాయగలుగుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 24 వరకు కొనసాగనున్నప్పటికీ ఈనెల 19న ప్రధానమైన పరీక్షలు ముగుస్తాయి.

Intermediate Exams in Telangana : 25 వేల 510 మంది ఇన్విజిలేటర్లు... 150 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు... 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. హాల్ టికెట్లను కళాశాల నుంచి ఇవ్వడంతో పాటు.. నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.

Snake at Dornakal Exam Center : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్​లోని ఇంటర్ పరీక్షా కేంద్రంలో పాము కలకలం సృష్టించింది. తరగతి గదిలోకి పాము రావడంతో విద్యార్థులు భయపడి బయటకు పరుగులు తీశారు. కళాశాల సిబ్బంది వచ్చి పామును అక్కణ్నుంచి పంపించడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. పరీక్ష రాసే ముందు ఇలాంటి ఘటన జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. కేంద్రంలోని ఇన్విజిలేటర్లు వారికి ధైర్యం చెప్పి లోపలికి పంపించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.