ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష రద్దయింది. పరీక్షకు కొన్ని గంటల ముందు ప్రశ్నాపత్రం లీకవడం వల్ల పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. బల్లియా జిల్లాలో పేపర్ లీక్ కావడంతో రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఇంగ్లీష్ పేపర్‌ను రద్దు చేసినట్టు ప్రకటించింది.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష పేపర్‌ను మార్కెట్‌లో రూ.500కు విక్రయించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 24 జిల్లాల్లోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సెకండియర్ ఇంగ్లీష్ పేపర్ పరీక్షను రద్దు చేసినట్టు విద్యాశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చూడండి: Recruitment exams Syllabus: నియామక పరీక్షల సిలబస్‌లో మార్పులు చేర్పులు