ETV Bharat / city

ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని కొట్టిన ఘటనపై ఇంటర్​ బోర్డు విచారణ - ap latest news

Lecturer beating a student: ఏపీలోని విజయవాడలో ఓ కళాశాలలో విద్యార్థిని అధ్యాపకుడు కొట్టిన ఘటనపై ఇంటర్​ బోర్డు విచారణ చేపట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై వేగంగా విచారణ జరిపి తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Lecturer beating a student
Lecturer beating a student
author img

By

Published : Sep 17, 2022, 5:50 PM IST

Lecturer beating a student: ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి సూర్య సిద్దార్థ్​ను అధ్యాపకుడు విచక్షణా రహితంగా కొట్టిన ఘటనపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, చైల్డ్ ఇన్ఫో వారు విచారణ చేపట్టారు. విద్యార్థి, ఆయన కుటుంబంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆ కళాశాల గుర్తింపును రద్దు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు సహాయ కార్యదర్శి డీఎస్సార్ కృష్టారావు తెలిపారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ విచారణ చేపట్టామన్నారు. ఆ తరగతికి చెందిన ఇతర విద్యార్థులతో మాట్లాడామన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు విచారణ కమిటీ రాక సందర్భంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎస్​ఎఫ్​ఐ, ఏఐఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన చేశారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే: విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్​ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టిన వీడియో దృశ్యాలు హల్​చల్​ చేస్తున్నాయి. ఓ కాలేజిలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై.. తరగతి గదిలోనే అధ్యాపకుడు చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో కాలుతో విద్యార్థిని తన్నాడు. ఈ ఘటనను వెనుక వైపు కూర్చున్న విద్యార్థులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఘటనపై ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఎస్ఏఫ్ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.