ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు దూరదర్శన్ ద్వారా టీవీ పాఠాలను ప్రసారం చేస్తారు. ప్రైవేట్ కళాశాలలు సొంతగా ఆన్‌లైన్ పాఠాలను అందించుకుంటాయి. అయితే ఎవరైనా టీవీ పాఠాలను వినియోగించుకోవచ్చు. ఇవీ ముఖ్యాంశాలు..
- పదో తరగతిలో గ్రేడ్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి. ఎలాంటి ప్రవేశ పరీక్ష జరపరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు ప్రకటించింది.
- ఏ కళాశాలలో ప్రవేశం పొందాలన్నా విద్యార్థులు ఆధార్ సంఖ్యను ఇవ్వాల్సిందే.
- విద్యార్థులను ఆకర్షించేలా, ప్రలోభాలకు గురిచేసే విధంగా కళాశాలలు ప్రవేశాలపై ప్రకటనలు ఇవ్వరాదు.
ప్రవేశాలు పొందడంపై అయోమయం
రాష్ట్రంలో ఒక వైపు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో కళాశాలలకు వెళ్లి ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది ఇంటర్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పినా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు పొందింది 2 శాతానికి మించి లేరని ఓ ప్రిన్సిపాల్ చెప్పారు. మరో వైపు అనుబంధ గుర్తింపు ఉన్న ప్రైవేట్ కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని సూచిస్తున్న అధికారులు ఆ కళాశాలల జాబితాను వెబ్‌సైట్లో పెట్టలేదు. విచిత్రమేంటంటే ఈ నెల 24వ తేదీ నాటికి ఆలస్య రుసుం లేకుండా అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. అతి కొద్ది కళాశాలలు మాత్రమే దరఖాస్తు చేశాయి. వాటికి కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో అనుమతి ఉందో లేదో తెలుసుకునేది ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏటా ఇంటర్‌బోర్డు ఆకస్మిక, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో ప్రవేశాల ప్రక్రియను చేపట్టరాదన్నారు. కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తికాకుండా ఎలా నోటిఫికేషన్ ఇస్తారని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు ఉంటుంది?