ETV Bharat / city

ఈసీజీ రూ.50, సీబీపీ రూ.30, మన హైదరాబాద్​లోనే, ఎక్కడంటే - చాలా తక్కువ ధరకు వైద్య పరీక్షలు అందిస్తున్న నారాయణగూడ ఐపీఎం

ఏ చిన్న జ్వరం వచ్చినా వైద్యుడి దగ్గరకి వెళ్తే రకరకాల టెస్టులు రాస్తుంటారు. కొన్నిసార్లు అవసరం లేకున్నా ముందస్తు జాగ్రత్తగా చేయాలని చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఆ పరీక్షలను ప్రై వైద్యం చేయనంటారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేయించుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీల్లో అన్నిరకాల టెస్టులు అందుబాటులో ఉండవు. ఒకవేళ వైద్య పరీక్షలు చేయించుకున్నా.. నివేదికలు ఎప్పుడొస్తాయో తెలియదు. ఇలాంటి వారందరికీ నారాయణగూడ ఐపీఎం కేంద్రం అండగా నిలుస్తోంది.

Institute of Preventive Medicine
Institute of Preventive Medicine
author img

By

Published : Aug 21, 2022, 11:15 AM IST

ప్రైవేటు ల్యాబ్‌ల్లో హిమోగ్లోబిన్‌(హెచ్‌బీ) టెస్టుకు రూ.150 పైనే చెల్లించాలి. దీన్ని నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం) ల్యాబ్‌లో రూ.10కే చేస్తున్నారు. ఒక్క హెచ్‌బీ పరీక్ష మాత్రమే కాదు.. పలు రక్తపరీక్షలకూ రూ.10మాత్రమే తీసుకుంటున్నారు. గుండె లయ అంచనాకు చేసే ఎలక్ట్రోకార్డియోగ్రఫీ(ఈసీజీ) టెస్టుకు ప్రైవేటులో కనిష్ఠంగా రూ.250-300 వరకు వసూలు చేస్తుంటారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రూ.500 పైనే తీసుకుంటారు. ఇందుకు ఐపీఎంలో కేవలం రూ.50 మాత్రమే చెల్లించాలి. థైరాయిడ్‌ను నిర్ధారించే టీ3, టీ4 పరీక్షలకు ప్రైవేటులో రూ. వేయికిపైనే వసూలు చేస్తుండగా.. ఐపీఎంలో రూ.70 చొప్పున చెల్లిస్తే చాలు. ఇదే ల్యాబ్‌లో కంప్లీట్‌ బ్లడ్‌పిక్చర్‌(సీబీపీ)కు రూ.30 మాత్రమే వసూలు చేస్తున్నారు.

ఏ చిన్న జ్వరం వచ్చినా.. వైద్యుడి వద్దకు వెళ్తే రకరకాల వ్యాధి నిర్ధారణ టెస్టులు రాస్తుంటారు. కొన్నిసార్లు అవసరం లేకున్నా ముందస్తు జాగ్రత్తగా చేయాలని సూచిస్తుంటారు. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి అనుభవమే. సంబంధిత పరీక్షలను ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేయించుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీల్లో అన్నిరకాల టెస్టులు అందుబాటులో ఉండవు. ఒకవేళ వైద్య పరీక్షలు చేయించుకున్నా.. నివేదికలు ఎప్పుడొస్తాయో తెలియదు. ఇలాంటి వారందరికీ నారాయణగూడ ఐపీఎం కేంద్రం అండగా నిలుస్తోంది. కొన్నేళ్లుగా ఈ కేంద్రంలో తక్కువ ధరకే పలురకాల టెస్టులు చేస్తున్నారు. నిత్యం 300-400 మంది ఇక్కడికి వస్తుంటారు. బయోకెమిస్ట్రీ విభాగంలో 60 రకాల టెస్టులు, సీరాలజీలో 9, పెథాలజీలో 33, బ్యాక్టీరియాలజీలో 19 రకాల టెస్టులతోపాటు డెంగీ, స్వైన్‌ఫ్లూ, అల్ట్రాసౌండ్‌ తదితర వైద్యపరీక్షలనూ అతి తక్కువ ధరకే అందిస్తున్నారు. ప్రజలు వినియోగించుకోవాలని ఐపీఎం కేంద్రం డైరెక్టర్‌ డా.శివలీల సూచించారు.

కొన్ని కీలకమైన టెస్టులు... ధరలు(రూ.లలో)

బయోకెమిస్ట్రీ: * ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌- 30 * ఎఫ్‌యూఎస్‌ టెస్టు- 10 * ఆర్‌యూఎస్‌- 10 * ఆర్‌బీఎస్‌- 30 * లిపిడ్‌ ప్రొఫైౖల్‌- 200 * లివర్‌ ఫంక్షన్‌ టెస్టు- 150 * సీరమ్‌ బైలురూబిన్‌- 40 * హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌- 50 * సీరం సోడియం, పొటాషియం, కాల్షియం- 150 * మూత్రపిండాల్లో రాళ్ల నిర్ధారణ- 120 * విటమిన్‌ డి3- 500 * విటమిన్‌ బి12- 300

సీరాలజీ: * వైడల్‌ టెస్టు- 30 * వీడీఆర్‌ఎల్‌- 20 * ప్రెగ్నెన్సీ నిర్ధారణ- 50 * సీఆర్‌పీ- 50

పెథాలజీ: * సీబీపీ- 30 * హెచ్‌బీ- 10 * సీయూఈ- 30 * ప్లేట్‌లెట్‌ కౌంట్‌- 20 * వీర్యం విశ్లేషణ- 40 * మలం విశ్లేషణ- 40 * బోన్‌మ్యారో స్టడీ- 50

బ్యాక్టీరియాలజీ: * స్వాబ్‌- 60 * స్పూటం టెస్టు- 20 * ఫంగల్‌ కల్చర్‌- 60

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.