ETV Bharat / city

23 రోజుల్లో.. 1,194 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌

కరోనా రెండో దశ విజృంభిస్తుండటంతో.. ఆక్సిజన్‌ కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొరత తీర్చేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ముందుకు వచ్చి ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నాయి. ఈ సరఫరాలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,194 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.

oxygen supply to Telangana
ఆక్సిజన్ సరఫరా
author img

By

Published : May 25, 2021, 4:51 PM IST

భారతీయ రైల్వే ద్వారా.. తెలంగాణకు ఇప్పటివరకు 1,194 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్‌ మాల్యా వెల్లడించారు. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లను.. ఒడిశా, జార్ఖండ్‌, గుజరాత్‌ నుంచి రవాణా చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో.. రైళ్లు వేగంగా చేరుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

రాష్ట్రానికి మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ మే 2న చేరుకోగా.. నేటి వరకు మొత్తం 14 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లకు చెందిన 70 ట్యాంకర్లలో.. 1,194 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను సనత్‌నగర్ రైల్వే స్టేషన్‌కు సరఫరా చేశామని మాల్యా వివరించారు. రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగడానికి కృషి చేసిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: ఈ నెల 28 నుంచి సూపర్ స్పైడర్లకు టీకాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.