దేశవ్యాప్త లాక్డౌన్లో భాగంగా భారతీయ రైల్వేలు ప్రయాణికుల రవాణా పూర్తిగా నిలిపివేసినా.. రైళ్లను రవాణాకు ఉపయోగిస్తున్నాయి. ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు గనుల ప్రాంతం నుంచి పరిశ్రమలకు ఉన్నతమైన సేవలు అందిస్తున్నాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని తాల్చేరు నుంచి చాలా రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నాయి.
లాక్డౌన్ మొదలైన మార్చి 22 నుంచి ఏప్రిల్ 27 వరకు పదిన్నర టన్నుల బొగ్గును తాల్చేర్ నుంచి వివిధ పవర్ ప్లాంట్లకు తూర్పు కోస్తా రైల్వే అధికారులు రవాణా చేశారు. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో అతి పెద్ద బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతం తాల్చేర్. మహానది పరివాహక ప్రాంతంలో ఒడిషాలో ఉన్న ఈ బొగ్గు గని నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు నల్ల బంగారాన్ని రవాణా చేశారు.
మొత్తం 11 బొగ్గు సైడింగ్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 6.48 మిలియన్ టన్నుల థర్మల్ కోల్‌ను 1,695 రైళ్ల ద్వారా పంపారు. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ కోసం కోక్, కోల్ ఇతర మినరల్స్‌ను ఒకటిన్నర మిలియన్ టన్నులు, దిగుమతి కోల్ 322 రైలు ద్వారా రవాణా చేసింది. దమార పోర్టు థర్మల్ కోల్ 1.2 మిలియన్ టన్నులు 295 రైళ్ల ద్వారా వివిధ పరిశ్రమలకు పంపింది.
విశాఖపట్నం పోర్టు 0.95 మిలియన్ టన్నుల బొగ్గును 232 రైళ్ల ద్వారా రవాణా చేసింది. గంగవరం పోర్టు 0.39 మిలియన్ టన్నుల బొగ్గును 96 రైళ్లలో పంపించింది. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలు, క్యాప్టివ్ విద్యుత్ కేంద్రాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సేవలు అందించింది.
ఇవీ చదవండి: