Indian Navy job notification : భారత నావికా దళం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌లో ఒక సంవత్సరం పాటు వివిధ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల 275 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. గతంలో ఏ సంస్థల్లో అయినా అప్రెంటిస్‌షిప్ శిక్షణ పూర్తి చేసినట్లయితే, ఆ అభ్యర్థి ఈ శిక్షణకు దరఖాస్తు చేసేందుకు అర్హులు కాదని అధికారిక నోటీస్‌లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apprenticeshipindia.org లో డిసెంబర్ 5, 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు..
- అభ్యర్థులు మొత్తం 50 శాతం మార్కులతో SSC, మెట్రిక్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- వారు మొత్తం 65 శాతం మార్కులతో ITI (NCVT/SCVT) కూడా ఉత్తీర్ణులై ఉండాలి.
- జనరల్ మరియు OBCకి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఏప్రిల్ 1, 2001- ఏప్రిల్ 1, 2008 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
- ఎస్సీ మరియు ఎస్టీలకు చెందిన వారు తప్పనిసరిగా ఏప్రిల్ 1, 1996 మరియు ఏప్రిల్ 1, 2008 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
- నౌకాదళ పౌరులు, రక్షణ ఉద్యోగుల పిల్లలు IHQ / MoD (నేవీ) ఆమోదానికి లోబడి రెండేళ్ల అదనపు వయో సడలింపు పొందుతారు.
ఎంపిక విధానం.. పరీక్ష వివరాలు..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో కూడిన రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
- ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి - గణితం నుంచి 20, జనరల్ సైన్స్ నుంచి 20, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు ఒకటిన్నర మార్కులు ఉంటాయి.
- జనవరి 27న పరీక్ష నిర్వహించి జనవరి 29న ఫలితాలు విడుదల చేయనున్నారు.
- రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను వివిధ రిజర్వేషన్ కేటగిరీలు మరియు ట్రేడ్‌లలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
- అభ్యర్థులకు ఆయా ట్రేడ్‌లలో ఉన్న సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రక్రియ జనవరి 31 నుండి ఫిబ్రవరి 3 మధ్య జరుగుతుంది.
- ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి 7 నుండి 15 మధ్య నిర్వహించబడే వైద్య పరీక్షలో పాల్గొనవలసి ఉంటుంది.
దరఖాస్తు విధానం..
-దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ apprenticeshipindia.org ను సందర్శించాల్సి ఉంటుంది.
- అనంతరం హోమ్‌పేజీలో, ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి
- మీ పేరు మరియు చెల్లుబాటు అయ్యే ఫోన్, ఈమెయిల్ ఐడిని ఉపయోగించి నమోదు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
- అనంతరం దరఖాస్తు రుసుము చెల్లించి. అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.
- అనంతరం తుపరి అవసరాల కోసం అప్లికేషన్ ఫాంను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 5, 2021
ఇదీ చదవండి : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థుల నామినేషన్లు
ఇదీ చదవండి : హాస్టల్ భవనంపై నుంచి దూకి... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం