ETV Bharat / city

Karmanghat incident: హైదరాబాద్​లో మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తే.. : ఇన్​ఛార్జ్​ డీజీపీ

Karmanghat incident: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఇన్​ఛార్జ్​ డీజీపీ అంజనీకుమార్​ హెచ్చరించారు. కర్మన్​ఘాట్​ ఘటనపై సీపీలు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో 5 కేసులు నమోదు చేశామని చెప్పారు.

incharge dgp anjani kumar
incharge dgp anjani kumar
author img

By

Published : Feb 23, 2022, 5:14 PM IST

Karmanghat incident: మత ఘర్షణలు సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌ఛార్జ్‌ డీజీపీ అంజనీకుమార్​ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్ ఘటనపై సీపీలు సీవీ ఆనంద్, మహేశ్‌ భగవత్, స్టీఫెన్ రవీంద్రలతో సమీక్ష నిర్వహించారు. ఇంటలిజెన్స్ అదనపు డీజీ అనిల్​కుమార్​, శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్, కౌంటర్ ఇంటిలిజెన్స్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదని అంజనీ కుమార్‌ హెచ్చరించారు. కర్మన్‌ఘాట్ ఘటనలో 5 కేసులు నమోదు చేశామని.. ఏడుగురు అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ తెలిపారు. ఏడుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించామన్నారు.

'వారంతా రోహింగ్యాలే..: బండి సంజయ్​'

కర్మన్‌ఘాట్‌లో గోరక్షక్‌ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. తల్వార్లు, ఐరన్‌ రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని సంజయ్​ ప్రశ్నించారు. గోవధపై నిషేధం ఉన్న దేశంలో యథేచ్చగా గోవులను కబేళాలకు తరలిస్తుంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తల్వార్లు, ఐరన్​ రాడ్లు పట్టుకొని తిరుగుతున్నవారంతా రోహింగ్యాలేనని తమ సమాచారం ఉందని సంజయ్​ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే దాడులకు పాల్పడ్డ రోహింగ్యాలను అరెస్టు చేయాలని.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని బండి సంజయ్​ హెచ్చరించారు.

'గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షకులపై దాడులు చేశారు. దాడులకు పాల్పడినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.'

- బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

మంగళవారం రాత్రి ఏం జరిగిందంటే..?

మంగళవారం రాత్రి కర్మన్‌ఘాట్‌ వద్ద గోవులను అక్రమంగా తరలిస్తున్న వారితో పాటు ఉద్రిక్తతకు కారణమైన ఏడుగురిని మీర్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. భవానీనగర్‌కు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌, మహ్మద్‌ నిసార్‌, మహ్మద్‌ నవాజ్​​తో పాటు మరో నలుగురు బోలేరో వాహనంలో గోవులను తరలిస్తుండగా... మార్గంమధ్యలో గాయత్రీనగర్‌ వద్ద కొందరు గోరక్షక్‌ దళ్‌ సభ్యులు వాహనాన్ని ఆపమని కోరారు. ఈ క్రమంలో వారు వాహనాన్ని నిలపకుండా ముందుకు వెళ్లిపోయారు. వారిని వెంబడించి వాహనాన్ని నిలపడంతో... గోవులను తరలిస్తున్న వారు గోరక్షక్‌ దళ్‌ సభ్యులపై కర్రలతో దాడి చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై పలు సెక్షన్‌ల కింద ఐదు కేసులు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి... మూడు గోవులు, రెండు గేదెలు, బొలేరో వాహనం, ద్విచక్ర వాహనంతో పాటు ఇనుప రాడ్లు, ఆరు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీచూడండి: Kharmanghat issue update: పోలీసుల అదుపులో కర్మన్​ఘాట్ దుండగులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.