సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఓలిఫెంటా బ్రిడ్జి సమీపంలో 6 కోట్ల రూపాయలతో స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, మెట్రో అధికారులు స్థలాన్ని పరిశీలించారు. స్కై వాక్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు మున్సిపాల్ అధికారులు తెలిపారు. ఇక నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నియంత్రణ - ప్రణాళిక
- బోయగూడ రైల్వే స్టేషన్, సంగీత్ టాకీస్ నుంచి ఒలిఫెంటా వైపు వచ్చే వాహనాలు... మెట్టుగూడ రైల్వే క్వార్టర్ మీదుగా సికింద్రాబాద్‌కు వచ్చే వాహనాలకు ఇబ్బంది కలగకుండ స్కై వేలో పాదచారులు వెళ్లేందుకు రూపకల్పన చేస్తున్నారు.
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్లు.. ఉప్పల్, మెట్టుగూడ, తార్నాక వైపు వెళ్లే పాదచారులు స్కై వాక్ మీదుగా చిలకలగూడ చౌరస్తాలో ఉప్పల్ వైపు బ్రిడ్జి దిగి బస్‌స్టాప్‌కు వెళ్లే విధంగా సిద్ధం చేస్తున్నారు.
- రేపటి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.