ETV Bharat / city

వ్యవసాయక్షేత్రమైన ఇల్లు... మిద్దె సేద్యంతో ఆకట్టుకుంటున్న ఇల్లాలు

ఆ ఇల్లు ఓ నందనవనం.. అడుగుపెట్టగానే అందమైన పూల మొక్కలు స్వాగతం పలుకుతాయి. పండ్లు, కూరగాయల మొక్కలతో నయనానందకరంగా ఆహ్లాదం పంచుతాయి. సికింద్రాబాద్‌లో ఓ గృహిణి తన ఇంటిని వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. రకరకాల ప్రయోగాలు చేస్తూ సహజ సిద్ధంగా సేంద్రీయ పద్ధతులు అవలంభిస్తూ కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు.

Impressive terrace garden in secunderabad

author img

By

Published : Mar 16, 2021, 4:54 PM IST

వ్యవసాయక్షేత్రమైన ఇల్లు... మిద్దె సేద్యంతో ఆకట్టుకుంటున్న ఇల్లాలు

సికింద్రాబాద్‌ గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌ కాలనీలోని తన ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దారు నీతా ప్రసాద్. పర్యావరణం, ప్రకృతి.. మొక్కలు, పూలు అంటే నీతాకు పంచ ప్రాణాలు. అదే అలవాటుగా మార్చుకుని 2015 నుంచి ఇంట్లోనే మొక్కల పెంపకం మొదలు పెట్టారు. వెళ్లిన ప్రతి చోట కొత్తగా కనిపించే పూలు, పండ్ల మొక్కలు తెచ్చి నాటడం వ్యాపకంగా పెట్టుకున్నారు. ఆరోగ్యం పట్ల స్పృహ కలిగిన నీతా.. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో పండించిన పంటలకు దూరంగా ఉంటున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు సొంతంగా పండిస్తున్నారు. మూడంతస్తుల భవనంలో మూడు లేయర్లలో 18 వందలకు పైగా చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.

నీతా ప్రసాద్‌ ఇంటి ఆవరణలో ఎటు చూసిన పచ్చదనమే కనిపిస్తుంది. గులాబీ, బంతి, చేమంతి వంటి పూల మొక్కలు వేలాడుతూ స్వాగతం పలుకుతుంటాయి. టమాట, బెండ, బీర, సోర, కాకర వంటి అన్ని రకాల కూరగాయలతోపాటు ప్రత్యేకించి మామిడి, సపోటా, అంజీర్, జామ, దానిమ్మ, బత్తాయి, నారింజ, డ్రాగన్ ఫ్రూట్‌ తదితర పండ్లు పండిస్తున్నారు. ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్, జీవామృతం ఉపయోగిస్తూ చీడపీడలు, తెగుళ్లు సోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇళ్ల మధ్యన పచ్చదనం కనుమరుగవుతున్న తరుణంలో ఇంటికి ఆకుపచ్చని తివాచిలా మార్చిన తీరు ముచ్చట గొలుపుతోందని నీతా ప్రసాద్‌ భర్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోని చెట్లకు కాసే పండ్లను స్వయంగా కోసుకుని తింటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదని అంటున్నారు.

ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్న బోన్సాయ్ మొక్కలు కాలనీవాసులను ఆకట్టుకుంటున్నాయి. నీటి ఎద్దడి వల్ల డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు సాధ్యం కాకపోవడం వల్ల.. మల్చింగ్ విధానాన్ని అవలంభిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఊడ్చేసిన మొక్కల ఎండుటాకులను ఎరువుగా మార్చి ఉపయోగిస్తున్నారు. విషయం తెలిసుకున్న ఉద్యాన శాఖ సంచాలకులు స్వయంగా నీతా ప్రసాద్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. స్వయంగా ఇంటిని సందర్శించి ఉద్యాన శాఖ తరఫున ప్రశంసాపత్రం అందించనున్నారు.

ఇదీ చూడండి: శునకాల అందమే.. వారికి ఆదాయం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.