ETV Bharat / city

నివర్ ఎఫెక్ట్: కృష్ణా డెల్టా రైతులకు కన్నీరు - nivar effect on Krishna District

నివర్ తుపాను ఏపీలోని కృష్ణా డెల్టా రైతులకు కన్నీరు మిగిల్చింది. ఆరుగాలం కష్టించిన అన్నదాతలకు అప్పులే మిగిలాయి. విరుచుకుపడిన జలవిలయం... చేతికాడికొచ్చిన పంట అందకుండా చేసింది. వేలఎకరాల్లో పంటలు నాశనమవగా.. ఆరబెట్టిన ధాన్యం మొలకెత్తింది. ఏడాది పొడవునా తుపానుల ధాటికి అంతంత మాత్రం పండిన పంటలు కాస్తా... నీటిపాలయ్యాయి. పెట్టిన పెట్టుబడులు తిరిగి రాని పరిస్థితుల్లో ఈ ఏడాదీ అప్పులే మిగిలాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్య బంగారం తాకట్టు పెట్టి , అందిన కాడికి అప్పలు తెచ్చి పంటలు పండించామని... తుపానుతో సర్వం పోగొట్టుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకుని సాయమందించాలని కోరుతున్నారు.

impact-of-nivar-cyclone-on-krishna-district-farmers
నివర్ ఎఫెక్ట్: కృష్ణా డెల్టా రైతులకు కన్నీరు
author img

By

Published : Nov 29, 2020, 9:08 PM IST

నివర్ తుపాను ఏపీలోని కృష్ణా జిల్లా రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది. 4 రోజుల పాటు ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వేలాది హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4.50 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే వాటిలో 2.38 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. జిల్లాలో వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారు. వరి, మిరప, పసుపు, కంద, మినుము, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే పలుసార్లు వచ్చిన తుపానుతో ఈ సారి పంటల ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉంది. కనీసం పెట్టుబడులైనా తిరిగి వస్తే చాలనుకున్న రైతన్నలకు పంటచేతికొచ్చే సమయంలో వచ్చిన తుపాను కన్నీటినే మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. నెలరోజుల్లో ధాన్యం ఇంట్లో ఉండేది. ఈ సమయంలో ఈదులుగాలులతో వచ్చిన తుపాను వరి పంట నడుం విరిచింది. దీంతో వేలాది ఎకరాలు నేల మట్టమైంది. ఇప్పటికీ వేల ఎకరాలు నీటి ముంపులోనే ఉన్నాయి. కౌలుకు తీసుకుని ఎకరాకు 40 వేల వరకు పెట్టుబడి పెట్టామని.. ఈ సారి పెట్టుబడి పోగా.. కౌలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. అందిన కాడికి అప్పులు తెచ్చి పంటలు పండిస్తే తీరా చేతికొచ్చే సమయానికి తుపాను కొంప ముంచిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెులకెత్తిన ధాన్యం

జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో పంటలను ఇప్పటికే కోశారు. రహదారులపై ధాన్యాన్ని ఆరబెట్టిన సమయంలో వచ్చిన తుపాను నిండా ముంచేసింది. నాలుగు రోజుల పాటు ఏకధాటిన కురిసిన వర్షంతో కుప్పగా పోసిన ధాన్యమంతా మొలకెత్తింది. ధాన్యం రంగు మారిపోయింది. నాలుగు రోజుల్లో ధాన్యం అమ్ముడు పోయి కష్టాలు తీరేవని.. ఈ సమయంలో వచ్చిన తుపాను తమను కష్టాల పాలుచేసిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు..

నూర్పిడికి అధిక ఖర్చులు

నందిగామ, జగ్గయ్యపేట, అవనిగడ్డ, పెనమలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నంలో వరికి అపార నష్టం కలిగింది. వరి నేల మట్టంకావడం వల్ల యంత్రాలతో నూర్పిడి చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గంటకు 3 వేల రూపాయలు యంత్రానికి బాడుగ ఉండగా.. ప్రస్తుతం పంట నేలమట్టం కావడం వల్ల రెట్టింపు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. పలు నియోజక వర్గాల్లో అరటి, మినుము, కంద, పసుపు, పత్తి దారుణంగా దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. కౌలు తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుందని.. అది కూడా చెల్లించలేని దుస్ధితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

పరిహారం ఇప్పించండి

వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికీ పంటల వద్దకు రాలేదని చాలా మంది రైతులు చెబుతున్నారు. అధికారులు వెంటనే పంటనష్టాన్ని నమోదు చేసి పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.