రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains in telangana) కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి రాష్ట్రం మీదుగా బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
పలు జిల్లాల్లో.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని కేంద్రం సంచాలకులు వెల్లడించారు. జూన్ 3వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశాలున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: Bank timings: రేపటి నుంచి బ్యాంకుల టైమింగ్స్ మారాయి