మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప సముదాయంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. రాజీవ్ గృహకల్ప సముదాయంలో కొందరు స్థానికులు.. తమ ఇళ్లకు ఆనుకుని ఉన్న స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీనిపై గతంలోనే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు వాటిని కూల్చేశారు.


తాజాగా మరికొందరు బ్లాక్ నంబర్ 37 వద్ద నిర్మాణాలు చేపట్టారు. గుర్తించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు వాటిని కూల్చేసేందుకు ప్రయత్నించగా... స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను వారించారు. బందోబస్తు నడుమ అక్రమ కట్టడాలను కూల్చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


