ప్ర: కొవిడ్‌పై ప్రపంచమంతా యుద్ధం చేస్తుండగా.. అందులో కీలక పాత్ర పోషిస్తున్న ఐఐసీటీ పోషిస్తుంది. ఔషధాాలకు అవసరమైన ఏపీఐల విషయంలో ఎంత వరకు పరిశోధనలు వచ్చాయి?
జ: కొవిడ్‌కి ప్రస్తుతం మందేమీ లేదు. యాంటీ వైరల్ డ్రగ్స్ ఏమన్నా ఉపయోగించొచ్చా అని అన్ని దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఓ రెండు మూడు వినియోగించొచ్చని తేలింది. ప్రపంచమంతా క్లినికల్ ట్రయల్స్ జరుగుతన్నాయి. వేరే దేశం నుంచి డ్రగ్స్‌కి ధర ఎక్కువ అవుతుంది. ఫలితంగా మనదేశంలోనే తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం.
ప్ర: అనుమతులకు, ఉత్పత్తి ప్రారంభానికి ఎంత సమయం పడుతుంది?
జ: ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా రెగ్యులేటరీ అథారిటీ క్లినికల్ ట్రయల్స్ లేకుండా అనుమతిస్తే 6-8 వారాల్లో 5-10 వేల టాబెట్లు తయారు చేస్తారు. 2నెలలు సమయంలో సుమారు 10 లక్షల టాబెట్లు తయారు చేసే సామర్థ్యం సిప్లాకు ఉంది.
ప్ర: ఇతర దేశాల్లో జరిగిన క్లినికల్ ట్రయల్స్ ప్రకారం వినియోగించుకునేలా.. మనకున్న చట్టాలు, నిబంధనలు ఏం చెబుతున్నాయి?
జ: రెగ్యూలేటరీ అథారిటీస్.. వారి అధికారాలు, విచక్షణతో అత్యవసర పరిస్థితుల్లో క్లినికల్ ట్రయల్స్ లేకుండానే అనుమతిస్తాయని అనుకుంటున్నాం. ఎప్పుడైనా డిసీజ్‌ని క్యూర్ చేసిందాని కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవడం ముఖ్యం.
ప్ర: ప్రస్తుతం వైద్యులు చెబుతున్నట్టు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏ విధంగా సమర్థంగా పనిచేస్తుంది?
జ: 60, 70 ఏళ్ల క్రితం మలేరియా కోసం వ్యాక్సిన్ కనుగొన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ రక్తంలోని హిమోగ్లోబిన్లో బైండ్ అవుతుందని బయాలజీ శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కరోనా వైరస్ కూడా రక్తం ద్వారానే పోతుందుని సమాచారం ఉంది. విదేశీ శాస్త్రవేత్తలు క్లినికల్ ట్రయల్ చేశారు.
ప్ర: కరోనాను ఎదుర్కొనేందుకు నేరుగా చికిత్స అందించే ఔషధం రావడానికి ఎంత సమయం పట్టొచ్చు?
జ: వైరస్‌ను కనుక్కొని తక్కువ సమయమే అవుతుంది. వ్యాక్సిన్ కనుక్కొనేందుకు 12-16 నెలలు పట్టొచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. సంవత్సరంలోపే వస్తుందని చెప్పడం అత్యాశే అవుతుంది.
ప్ర: ఎప్పటిలోగా సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది?
జ: విపత్తు ఎక్కువ రోజులు ఉండదు. చైనాలో చూస్తున్నాం.. కేసుల సంఖ్య సున్నాకి వచ్చింది. బహుశా రెండు, మూడు వారాల్లో సాధారణ స్థితికి రావచ్చు.
ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'