నిరంతరం మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ దక్షిణాసియా ఛైర్మన్ గౌస్ పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాక విజయపురి కాలనీలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు.
మానవ హక్కుల పరిరక్షణతో పాటు సమాజ సేవనూ తమ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నట్లు గౌస్ స్పష్టం చేశారు. నూతన ఛైర్మన్‌గా కటకం శ్రీనివాస్, వైస్ ఛైర్మన్లుగా బెజ్జంకి రాజేష్, శ్రీరామరాజు, కార్యనిర్వాహక ఛైర్మన్లు విశ్వేశ్వరరావు, శ్రీనివాస్, సాయి కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సోమ మధుసూదన్, ఉపాధ్యక్షురాలిగా మంజులత, ప్రధాన కార్యదర్శిగా గౌరీ శంకర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం