ETV Bharat / city

ఇడుపులపాయలో కొనసాగుతున్న ఆందోళన.. తగ్గేదే లే అంటున్న విద్యార్థులు - ఇడుపులపాయలో విద్యార్థుల ఆందోళన

Students Protest: ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని.. అప్పుడే ఆందోళన విరమిస్తామని అంటున్నారు. అప్పటి వరకూ పోరాటం కొనసాగుతుందని నినదిస్తున్నారు.

ఇడుపులపాయలో కొనసాగుతున్న ఆందోళన.. తగ్గేదే లే అంటున్న విద్యార్థులు

author img

By

Published : Mar 21, 2022, 10:26 PM IST

Students Protest: ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ట్రిపుల్ ఐటీలోని ఓల్డ్​ క్యాంపస్ గేట్ వద్ద పి1, పి2 విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోని న్యూ క్యాంపస్ డైరెక్టర్ ఛాంబర్ వద్దకు విద్యార్థులను వెళ్లినీయకుండా పోలీసులు, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఓపెన్ ది గేట్ అంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు.పోలీసులు, డైరెక్టర్ సంధ్యారాణి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యార్థులు ఓల్డ్ క్యాంపస్​లోని గేట్ వద్దకు రావడంతో సెక్యూరిటీ సిబ్బందికి, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.దీంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ఫ గాయాలయ్యాయి. స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకూ ఆందోళన విరమించబోమని విద్యార్థులు తేల్చిచెప్పారు.

అసలు వివాదం ఏమంటే?
కనీస వసతులు కూడా కల్పించకుండా.. తమను కొత్త క్యాంపస్ నుంచి పాత క్యాంపస్​కు వెళ్లమని చెబుతున్నారని ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సరైన వసతులు కల్పించే వరకూ పాత క్యాంపస్‌కు వెళ్లబోమని తేల్చిచెప్పారు. ఉన్నపళంగా పాత క్యాంపస్‌లోకి వెళ్లాలంటూ శనివారం రాత్రి 9 గంటలకు డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణి చెప్పారని.. అప్పటినుంచి వివాదం చెలరేగిందని విద్యార్థులు తెలిపారు.

రాత్రికి రాత్రే..

3 నెలలుగా కొత్త క్యాంపస్‌లో ఉంటున్నామని.. రాత్రికి రాత్రే లగేజీ, ఇతర సామగ్రిని ట్రాక్టర్​లో పడేసి పాత క్యాంపస్‌కు తరలించారని వాపోయారు. విశ్రాంతి గదులు సరిగా లేకపోవడం, తలుపుల్లేని మరుగుదొడ్లు, ఇతర వసతులు లేవని... దీనివల్ల శనివారం రాత్రంతా నిద్ర కూడా లేదని ఆవేదన చెందారు. ఈ విషయం తెలుసుకుని ఆదివారం ఇడుపులపాయ వచ్చిన తల్లిదండ్రులు.. డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యరాణిని నిలదీయడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.

ఆందోళనకు దిగిన విద్యార్థులపై డైరెక్టర్‌ కసిరెడ్డి సంధ్యారాణి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో ధర్నాలో కూర్చున్న ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ఈ చర్యను విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. అందరూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గని డైరెక్టర్ కసిరెడ్డి సంధ్యారాణి.. ట్రిపుల్ ఐటీకి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులంతా వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని... లేదంటే పోలీసుల సాయంతో బలవంతంగా పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

డైరెక్టర్‌ కసిరెడ్డి సంధ్యారాణి హెచ్చరికలకు భయపడని విద్యార్థులు.. మరింత గట్టిగా నినాదాలు చేశారు. ఆదివారం చీకటి పడిన తర్వాత కూడా సెల్‌ఫోన్ల లైటింగ్ వెలుగులో ఆందోళన కొనసాగించారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సంధ్యారాణి చెప్పుకొచ్చారు. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కె.చెంచురెడ్డి.. సమస్యలు శాశ్వతం కాదన్నారు. త్వరలోనే మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.